జనవరి 26న రానున్న ‘షికారు’ !

Published on Dec 13, 2021 3:49 pm IST

డైరెక్టర్ హరి దర్శకత్వంలో సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా ‘షికారు’. కాగా ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ బాబ్జి గారు మాట్లాడుతూ… కరోనా ఇబ్బందులు దాటుకొని షికారు సినిమా పూర్తి చేశాం, కచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది. మా హీరోయిన్ ధన్సిక చాలా బాగా చేసింది, నలుగురు యువ హీరోలు చాలా బాగా చేసారు, సిద్ శ్రీ రామ్ పాడిన పాట బాగా వచ్చింది ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అవుతుంది, మా డైరెక్టర్ హరి గారు కథ చెప్పినప్పుడు ఎంత ఎక్సయిట్ అయ్యానో, సినిమా తీసిన విధానం చూసి అంతకు మించి ఎక్సయిట్ అయ్యాను, జనవరి 26న మా సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం’ అని ముగించారు.

డైరెక్టర్ హరి మాట్లాడుతూ.. ‘ఒక చిన్న సినిమా ముందుకు రావాలి అంటే ప్రొడ్యూసర్ కావాలి, నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ బాబ్జిగారి కి థాంక్స్, నేను ఏ ఆర్టిస్ట్ లు కావాలంటే వాళ్ళని నాకు ఇచ్చారు బాబ్జి గారు. అలాగే టెక్నికల్ టీమ్ ని నాకు కావాల్సిన వాళ్ళని అందరిని సమకూర్చారు. అందుకు బాబ్జి గారికి థాంక్స్’ అని చెప్పారు హరి.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘ముందుగా షికారు టీం కి నమస్కారం, ప్రొడ్యూసర్ బాబ్జి తెలుగు సినిమా చరిత్రలో ఆరువందల సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన వ్యక్తి. సినిమా మీద వున్న ఆయనకున్న జడ్జిమెంట్ ఆయనకున్న పట్టు ఎవరికీ లేదు అని చెప్పాలి. తనకి ఒక జడ్జిమెంట్ వుంది. యూత్ అంత అట్ట్రాక్ట్ అయ్యే సినిమా ఇది, టీమ్ కి మంచి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఇక ఈ సినిమాను బాబ్జి గారు ఒక రేంజ్ లో పబ్లిసిటీ చేస్తారు, ఒక ప్రొడ్యూసర్ గా మంచి జర్నీకి ఈ సినిమా ఆయనకి పునాది కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరోయిన్ సాయి ధన్సిక మాట్లాడుతూ.. ‘ఈ ఫిల్మ్ నాకు చాలా స్పెషల్, తమిళ్ లో చాలా ఫిల్మ్స్ చేశాను, కబాలి లో చేశాను, హరి గారు చెన్నై వచ్చి కథ చెప్పారు, నా కళ్ళు చూసి, ఈ క్యారెక్టర్ కి నేను పర్ఫెక్ట్ అని హరి గారు చెప్పారు, ఈ క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్ క్యారెక్టర్, ప్రొడ్యూసర్ గారి తో అలాగే డైరెక్టర్ గారి తో నాకు చాలా కంఫర్ట్ వుంది, ఈ మూవీలో నాతో యాక్ట్ చేసిన మా టీమ్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’ అని తెలిపింది సాయి ధన్సిక

సంబంధిత సమాచారం :