డ్రగ్స్ కేసులో దసరా విలన్.. హోటల్ నుంచి పరార్!

డ్రగ్స్ కేసులో దసరా విలన్.. హోటల్ నుంచి పరార్!

Published on Apr 17, 2025 5:00 PM IST

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గురించి అందరికీ తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా తనకు ఇచ్చిన పాత్రను పర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను అందుకుంటాడు. ఇక ఆయన చేసే రోల్స్ కూడా ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండటంతో ఆయనకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే, సినిమాల్లో ఎంత వైవిధ్యంగా ఈ యాక్టర్ కనిపిస్తాడో.. అదే విధంగా పలు వివాదాల్లో ఆయన పేరు తరుచూ వినిపిస్తుంది.

ఇటీవల ఓ మలయాళ నటి షైన్ టామ్ చాకోపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన తనతో అనుచితంగా ప్రవర్తించాడని సదరు నటి కేసు పెట్టింది. ఇక ఇప్పుడు ఈ నటుడిపై ఏకంగా డ్రగ్స్ కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పోలీసులు ఓ హోటల్‌లో డ్రగ్స్ దందా నడుస్తుందని తెలియడంతో రైడ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న షైన్ టామ్ చాకో అక్కడి నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది.

దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ డ్రగ్స్ కేసులో ఆయనకు ఎలాంటి సంబంధం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఇక తెలుగు ప్రేక్షకులకు ‘దసరా’ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన షైన్ టామ్ చాకో సుపరిచితుడే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు