ఘ‌నంగా “శివ శంభో” ప్రీ-రిలీజ్ ఈవెంట్

ఘ‌నంగా “శివ శంభో” ప్రీ-రిలీజ్ ఈవెంట్

Published on Apr 22, 2025 8:30 AM IST

Shiva Shambo

తెలుగు వెండితెర‌పై మ‌రో భ‌క్తిర‌స చిత్రం క‌నువిందు చేయ‌బోతోంది. అనంత ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కృష్ణ ఇస్లావత్, సాయి చక్రవర్తి, కేశవర్థిని బేబీ రిషిత ప్రధాన పాత్రల్లో, నర్సింగ్ రావు ద‌ర్శక‌త్వంలో బొజ్జ రాజ గోపాల్, దోరవేటి సుగుణ నిర్మించిన చిత్రం “శివ శంభో”. తనికెళ్ళ భరణి, సుమన్ ముఖ్య పాత్రల్లో న‌టించారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్రయూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వహించింది.

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా.గోరటి వెంకన్న, బీజేపీ నేత, జంతు ప్రేమికుడు చీకోటి ప్రవీణ్, ప్రముఖ న‌టుడు, ర‌చ‌యిత‌ డా. త‌నికెళ్ల భ‌ర‌ణి, బర్దీపుర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వర గిరి స్వామీజీ, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, త‌దిత‌రులు పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప్రముఖ న‌టుడు, ర‌చ‌యిత‌ త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ.. చిత్రయూనిట్ స‌భ్యులంద‌రికి పేరుపేరున‌ శుభాకాంక్షలు, అభినంద‌న‌లు. ఇలాంటి భ‌క్తిర‌స చిత్రాలు చాలా అరుదుగా వ‌స్తాయి. భారతీయ కళలైన సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా కలిగిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆద‌రించగలరనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. “సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా కలిగిన ఈ అరుదైన సినిమాను మ‌నమంతా గౌర‌వించాలి. ఇటువంటి చిత్రాలను ఉత్తమ అభిరుచి గల ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. చిత్రయూనిట్ స‌భ్యులంద‌రికి పేరుపేరున‌ శుభాకాంక్షలు, అభినంద‌న‌లు”. అని అన్నారు..

చిత్ర నిర్మాతల్లో ఒకరు, రచయిత, సంగీత దర్శకులు దోరవేటి మాట్లాడుతూ.. “ఏప్రిల్ 25న “శివ శంభో” చిత్రం విడుద‌ల చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ థియేట‌ర్‌కు వెళ్లి చూసి సినిమాను ఆద‌రించాల‌ని కోరుతున్నాము. ఇప్పటికే విడుద‌లైన ప్రచార చిత్రాలకు మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.” అని అన్నారు.

దర్శకుడు నర్సింగ్ ఎంతో శ్రమకోర్చి ఈ సినిమా ను నిర్మించామని, తప్పకుండా మంచి స్పందన వస్తుందని తెల్పుతూ, చిత్ర నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు