
‘పండగ చేస్కో’ లాంటి ప్యూర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘శివమ్’. రామ్ సరసన ఢిల్లీ ముద్దుగుమ్మ రాశి ఖన్నా హీరోయిన్ గా కనిపించనుంది. సెన్సార్ నుండి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకొని అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం రామ్ – రాశి ఖన్నాలు ఆంధ్ర, తెలంగాణాలను చుట్టేస్తూ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.
శివమ్ సినిమా ఆంధ్ర, తెలంగాణాలలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక్కడే కాకుండా ఓవర్సీస్ లో కూడా రామ్ కి డీసెంట్ మార్కెట్ ఉంది. దాంతో ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సుమారు 90కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. శివమ్ అవుట్ పుట్ విషయంలో మరియు రిలీజ్ విషయంలో ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉన్నారు. సురేందర్ రెడ్డి అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాని స్రవంతి రవికిషోర్ నిర్మించాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

