
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద కామెడీకి పెద్ద పీట వేసే సినిమాలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. అలాంటి జోనర్ లోనే ఎక్కువగా సినిమాలు చేసి బాక్స్ ఆఫీసు వద్ద హిట్స్ అందుకున్న యంగ్ హీరో రామ్ మరోసారి హీరోగా నటించిన లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ‘శివమ్’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. లవ్, కామెడీ, యాక్షన్ అన్నీ మిక్స్ చేసి చేసిన ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఈ చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్ శివమ్ సినిమా మొదటి నుంచి చివరి దాకా నవ్వుకునేలా ఉంటుందని అన్నారు. శివమ్ గురించి ఆయన మాట్లాడుతూ ‘మామూలుగా ఒక సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సీన్స్ ఆడియన్స్ కి నచ్చుతాయో లేదో అన్న భయం ఉంటుంది. కానీ శివమ్ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఒక్క సీన్ కూడా ఇది నచ్చదేమో అనే భయం కలగలేదు. ఆధ్యంతం నవ్వించే కథ అని’ స్రవంతి రవి కిషోర్ తెలిపాడు. దీన్ని బట్టి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని ఆశించవచ్చు. రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ జి నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

