నైజాంలో భారీగా రిలీజ్ అవుతున్న ‘శివమ్’

నైజాంలో భారీగా రిలీజ్ అవుతున్న ‘శివమ్’

Published on Oct 1, 2015 8:32 PM IST

Shivam
ప్రతివారంలానే ఈ వారం కూడా తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి వస్తున్న సినిమా ‘శివమ్’. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, అందాల భామ రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. పండగ చేస్కో’ లాంటి హిట్ తర్వాత రామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకి బిజినెస్ బాగా అయ్యింది. అంతే కాకుండా అన్ని ఏరియాలలో బాగా గ్రాండ్ గా వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

మాకు ఉన్న సమాచారం ప్రకారం ఒక్క నైజాం ఏరియాలోనే 215కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. కచ్చితంగా డీసెంట్ ఎంటర్టైనింగ్ సినిమాలు చేస్తాడన్న నమ్మకం రామ్ పై ఉండడంతో ఈ రేంజ్ లో రిలీజ్ అవుతోంది. లోకల్ లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా 90కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. సినిమాకి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ సూపర్ గా జరగడమే కాకుండా 5.5 కోట్లకి శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడం సినిమాకి మరింత హైప్ ని పెంచింది. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని స్రవంతి రవికిషోర్ నిర్మించగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు