కృష్ణవంశీ ‘రంగమార్తాండ’లో హీరో డాటర్

Published on Dec 13, 2019 6:35 pm IST

సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ త్వరలో ‘రంగమార్తాండ’ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగరంలో జరుగుతోంది. ఈ సినిమాలోని పాత్రల కోసం కృష్ణవంశీ ఆసక్తికరమైన రీతిలో నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఒక ముఖ్యమైన పాత్ర కోసం హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మికను తీసుకున్నారట ఆయన. ఇందులో ఆమె ఒక గాయనిగా కనిపిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

‘దొరసాని’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక ఆ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా తన అభినయంతో ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి ప్రసంశలు అందుకుంది. కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలోనే ఇలా కృష్ణవంశీ లాంటి దర్శకుడి చిత్రంలో ఆఫర్ దక్కడం ఆమెకు ఒక గొప్ప అవకాశమనే చెప్పాలి. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనున్నారు. మధు కలిపు, అభిషేక్ జవ్కర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :