నాని ‘ప్యారడైజ్’ ఏకంగా అప్పటికి షిఫ్ట్ కొట్టిందా?

నాని ‘ప్యారడైజ్’ ఏకంగా అప్పటికి షిఫ్ట్ కొట్టిందా?

Published on Jun 7, 2026 10:00 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ స్కేల్ పాన్ వరల్డ్ చిత్రమే ‘ది ప్యారడైజ్’. నాని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కూడా ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం చూస్తున్న వీరికి మాత్రం మేకర్స్ ఎదురు చూపులే మిగులుస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్యారడైజ్ సినిమా మళ్ళీ ఆగష్టు నుంచి కూడా వాయిదా పడింది అనే రూమర్స్, రవితేజ ఇరుముడి అదే డేట్ ని లాక్ చేసుకోవడం తీవ్ర నిరాశని మిగిల్చాయి. దీనితో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే దానికి ఇపుడు లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీనితో ఈ సినిమా ఏకంగా డిసెంబర్ కి షిఫ్ట్ అయ్యిందనే టాక్ మొదలైంది.

ఒకవేళ ఇదే నిజం అయితే ఉన్న హైప్ ని మరింత తగ్గించుకున్నట్టే అవుతుందని చెప్పక తప్పదు. సో దీనిపై మేకర్స్ ఓ అధికారిక క్లారిటీ త్వరలో ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు