షాకింగ్.. యష్ ‘టాక్సిక్’ ఏకంగా అప్పటికి షిఫ్ట్?

షాకింగ్.. యష్ ‘టాక్సిక్’ ఏకంగా అప్పటికి షిఫ్ట్?

Published on Jun 10, 2026 3:00 PM IST

Toxic-Movie

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి అలాగే కియారా అద్వానీ, నయనతారలు ప్రధాన పాత్రల్లో దర్శకురాలు గీతూ జోసెఫ్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “టాక్సిక్”. ఈపాటికే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో బిజినెస్ అలానే హైప్ ని బిల్డ్ చేసుకోలేక మంచి సమయం కోసం ఎదురు చూస్తుంది.

ఇలా టాక్సిక్ చిత్రం రిలీజ్ ఎప్పుడు అనేది అభిమానుల్లో సస్పెన్స్ గా మారితే ఓ షాకింగ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం టాక్సిక్ సినిమా ఏకంగా ఈ ఏడాది అక్టోబర్ కి షిఫ్ట్ అయ్యింది అనే కొత్త టాక్ స్టార్ట్ అయ్యింది. కన్నడ సినీ వర్గాల్లో కూడా ఇదే సమయంలో సినిమా రావచ్చనే గట్టిగా వినిపిస్తుంది.

అక్టోబర్ మొదటి వారంలో కానీ మూడో వారంలో కానీ సినిమా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా లేటెస్ట్ బజ్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా యష్, కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు