తెలుగులో “అవతార్ 2” కి షాకింగ్ బిజినెస్..?

తెలుగులో “అవతార్ 2” కి షాకింగ్ బిజినెస్..?

Published on Oct 30, 2022 9:08 PM IST

వరల్డ్ వైడ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అయితే దర్శకుడు జేమ్స్ కేమరూన్ సినిమాలు టైటానిక్, అవతార్ చిత్రాలు సెట్ చేసిన తిరగరాయలేని రికార్డులు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. తన సినిమాలు సృష్టించిన వసూళ్లు అయితే ఏ సినిమా కూడా పలు దశాబ్దాలు పాటుగా అందుకోని రేంజ్ వసూళ్లు కొత్త సినిమాల థియేటర్స్, టికెట్ రేట్స్ కన్నా తక్కువ నెంబర్స్ తో కనీ వినీ ఎరుగని రికార్డ్స్ సెట్ చేసి పెట్టాయి.

ఇక అవతార్ అయితే 2009 లో రిలీజ్ అయ్యినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ సినిమానే హైయెస్ట్ గ్రాసర్ గా ఉంది. అందుకే ఇక నెక్స్ట్ అవతార్ 2 పై అయితే మైండ్ బ్లాకింగ్ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజ్ తో అయితే మన తెలుగులో ఈ సినిమాకి షాకింగ్ బిజినెస్ అయ్యేలా ఉందని సినీ వర్గాల్లో గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే 100 కోట్ల మేర క్వోట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక్క తెలుగు స్టేట్స్ లో ఈ మొత్తం అంటే షాకింగ్ అనే చెప్పాలి. కానీ దీనిపై మాత్రం మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు