అల్లరి నరేష్ కొత్త ఇమేజ్ కి ‘నాంది’ పలికాడు.

Published on Jan 20, 2020 8:32 am IST

అల్లరి నరేష్ తన లేటెస్ట్ మూవీ పోస్టర్స్ తో ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి కలిగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం సీరియస్ ఇంటెన్స్ లుక్ లో ఉన్న అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేసిన నరేష్, నేడు టైటిల్ పోస్టర్ మరింత ఆసక్తిరేపేలా విడుదల చేశారు. ఒంటిపై నూలు పోగులేకుండా తలక్రిందులుగా వ్రేలాడదీసిన నరేష్ పోస్టర్ గూస్ బంప్స్ కలిగిస్తుంది. పోలీస్ లు అతన్ని చిత్ర హింసలుపెడుతున్నట్లు అర్థం అవుతుంది. నాంది అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నేడు రామానాయుడు స్టూడియోలో ఉదయం 9:44 నిమిషాలకు ప్రారంభం కానుంది.

ఎస్ వి టూ ఎంటర్టైన్మెంట్స్ అనే ఓ కొత్త ప్రొడక్షన్ కంపెనీ మొదటి చిత్రంగా అల్లరి నరేష్ హీరోగా ఈ చిత్రాన్ని చేస్తున్నారు. దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More