‘రోబో-2’ ఆడియో ఈవెంట్ టికెట్ ధర వింటే షాకవుతారు !
Published on Oct 23, 2017 12:41 pm IST


శంకర్ తెరకెక్కించిన ‘రోబో’ తెలుగు లో ఎలాంటి సంచలన విజయం సాధించిందో తెల్సిందే..ఇప్పుడు ‘రోబో 2’ ఫై అంతకు మించి అంచనాలు నెలకొని ఉన్నాయి. రజనీకాంత్ , అమీ జాక్సన్ , అక్షయ్ కుమార్ నటిస్తుండడం , దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. సినిమాపై ఉన్న అంచనాలకు తగట్టే ‘రోబో2’ ఉండబోతుందని మేకింగ్ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విఎఫ్ఎక్స్ పనులు చక చకా జరిగిపోతున్నాయి.

చిత్ర ఆడియో వేడుకని ఈ నెల 27న దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పార్క్ లో జరపబోతున్నారు. తాజా సమాచారం మేరకు ఆడియో వేడుకను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తుండగా ఒక్కో టికెట్ ధర దాదాపు అరవై వేలు పలుకుతోందట. అయినా సరే ప్రేక్షకులు వాటిని కొనడానికి వెనకాడడం లేదట. 26 న ఒక ప్రెస్ మీట్ ఉండబోతుంది, 27 న మెయిన్ ఆడియో లాంచ్ జరగబోతుంది.

 
Like us on Facebook