న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ‘దసరా’. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే మూవీ రాబోతుంది. తాజా అప్ డేట్ ప్రకారం, ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే రూ. 200 కోట్లు దాటిందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా మార్చి 26, 2026న విడుదల కావాల్సి ఉంది, కానీ షూటింగ్ లేట్ కారణంగా విడుదల తేదీ వాయిదా పడుతోంది. ఒకవేళ ఈ సినిమా బడ్జెట్‌కు సంబంధించిన పుకార్లు నిజమైతే, నాని కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ సినిమా అవుతుంది.
అన్నట్టు ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి.పైగా నాని ఇప్పటివరకు కనిపించని విభిన్న లుక్‌లో దర్శనమిచ్చాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నాని సరసన కయాదు లోహర్ నటిస్తుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


