ఆ హీరో రానా కి షాక్ ఇచ్చాడా…?

Published on Aug 9, 2019 11:24 am IST

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా శ్రీలంక లెజెండరి క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయో పిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఈ మూవీ అధికారిక ప్రకటన కూడా జరిగిపోయింది. ఇక రానా దగ్గుబాటి ఈ మూవీ నిర్మాణ భాగస్వామిగా మారడంతో ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ వచ్చి చేరింది. ఇంకొద్దిరోజులలో సెట్స్ పైకెళ్లనున్న తరుణంలో ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. అదేమిటంటే హీరో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకునే ఆలోచలనలో ఉన్నారని కోలీవుడ్ లో ఓ వార్త ప్రముఖంగా వినిపిస్తుంది.

విజయ్ సేతుపతి క్రేజ్ దృష్ట్యా ఆయన అభిమానులకు ఆయన ఈ చిత్రం చేయడం ఇష్టం లేకపోవడంతో విజయ్ సేతుపతి ఇలాంటి ఆలోచన చేస్తున్నారని వినికిడి. అలాగే ఈ చిత్రం బడ్జెట్ విషయంలో కూడా రానా దగ్గుబాటి అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. సచిన్ టెండూల్కర్ క్యామియో ఎంట్రీ ప్లాన్ చేయడంతో అనుకున్నదాని కంటే బడ్జెట్ పెరిగేలా ఉందని సమాచారం. దీనికి తోడు విజయ్ సేతుపతి నిర్ణయం రానా కి తలనొప్పిగా మారిందని సమాచారం. ఈ రూమర్స్ పై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ కోలీవుడ్ లో మాత్రం ప్రముఖంగా వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :