‘దేవదాస్’లు ముగించేశారు !

Published on Sep 11, 2018 6:43 pm IST

అగ్ర హీరో నాగార్జున మరియు న్యాచురల్ స్టార్ నాని కలిసి నటిస్తున్న చిత్రం ‘దేవదాస్’. ‘భలే మంచి రోజు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఈరోజుతో పూర్తయింది. ఈచిత్రంలో రౌడీ పాత్రలో నాగ్ దేవ్ గా నటిస్తుండగా డాక్టర్ పాత్రలో నాని దాస్ గా కనిపించనున్నాడు.

కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక , ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకం చలసాని అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల నెల 27న విడుదలకానుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈచిత్రంలోని రెండు పాటలు మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.

సంబంధిత సమాచారం :