
మంచు మనోజ్, రెజీనా జంటగా దశరథ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘శౌర్య’. ఈ సినిమాని సురక్ష్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మల్కాపురం శివ కుమార్ నిర్మించారు. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా 1000 థియేటర్స్ లో మార్చి 4 న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ “దశరథ్ కథ చెప్పినప్పుడు మొదటి సిట్టింగ్ లొనే ఓకే చేసాను” అని అన్నారు.
చిత్ర దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ “ప్రొడ్యూసర్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీసారు. అందరు ఆదరిస్తారని అనుకుంటున్నా” అని చెప్పారు. నిర్మాత మల్కాపురం శివ కుమార్ మాట్లాడుతూ “ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1000 థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అందరూ ఫాన్సీ రేట్లకు సినిమా ని కొన్నారు. అందరికి లాభాలు రావాలని ఆశిస్తున్నా” అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు ప్రభాస్ శ్రీను, పాటల రచయిత వరికుప్పల యాదగిరి పాల్గొన్నారు. ఇంతకూ ముందు మంచు మనోజ్, దశరథ్ కాంబినేషన్ లో 2004 లో “శ్రీ” అనే సినిమా వచ్చింది.