నిరూపించుకుని థియేటర్లు పెంచుకున్న రవితేజ

Published on Jan 23, 2021 3:00 am IST

మాస్ మహారాజ రవితేజ కొత్త చిత్రం ‘క్రాక్’ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. విడుదలైన 10 రోజులకే అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి వెళ్ళింది చిత్రం. ఇకపై వచ్చే వసూళ్లన్నీ లాభాలే. దీంతో ఎగ్జిబిటర్లు థియేటర్ల సంఖ్యను పెంచారు. 14వ తేదీ నాటికి హైదరాబాద్లో 154 షోలు వేస్తుండగా ఆ సంఖ్య మెల్లగా పెరిగిపోయింది. 16వ తేదీకి 175 షోలు అయ్యాయి. 17వ తేదీకి ఆ నెంబర్ 186కు చేరుకుంది.

18న తేదీకి 190, 19వ తేదీకి 208, 20వ తేదీకి 218 కాగా 22వ తేదీకి ఏకంగా 297 షోలకు చేరుకుంది. సంక్రాంతి సినిమాలు అన్నింటిలోకీ అమితంగా ఆకట్టుకున్న సినిమా కావడంతో ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఎగ్జిబిటర్లు థియేటర్ల సంఖ్యను పెంచారు. మాస్, క్లాస్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అన్ని వర్గాలు సినిమాను ఆదరిస్తున్నాయి. మొదట్లో షోల కౌంట్ తక్కువగా ఉందని డీలాపడిన హిట్ టాక్ తెచ్చుకుని షోల సంఖ్యను పెంచుకున్నారు. మొత్తానికి రవితేజ చాలారోజుల తర్వాత సాలిడ్ సూపర్ హిట్ అందుకుని కొత్త ఎనర్జీని పుంజుకున్నారు. ఈ విజయంతి గోపీచంద్ మలినేని పూర్తిస్థాయి కమర్షియల్ డైరెక్టర్ అనే పేరును తెచ్చుకున్నారు.

సంబంధిత సమాచారం :

More