ప్రభాస్‌తో పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పీరియాడిక్ వార్ మూవీ ‘ఫౌజీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తు్న్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3, 2026న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. అయితే, ప్రభాస్‌తో పోటీ పడేందుకు ఆయన నటించిన ‘సాహో’ మూవీ బ్యూటీ రెడీ అవుతుంది.

బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంది. ఆమె నటిస్తున్న ‘ఈఠ’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే, ఈ చిత్రాన్ని తొలుత ఆగస్టు 14న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, యష్ ‘టాక్సిక్’తో క్లాష్ నివారించేందుకు ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ‘ఈఠ’ చిత్రాన్ని డిసెంబర్ 4న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ప్రభాస్ ‘ఫౌజీ’తో ‘ఈఠ’ పోటీకి దిగనుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ప్రభాస్‌తో కలిసి శ్రద్ధా కపూర్ ‘సాహో’ చిత్రంలో నటించింది. వీరిద్దరి కాంబినేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మరి బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఈ ఇద్దరు పోటీ పడుతుండటంతో బాక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Exit mobile version