లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రద్ద శ్రీనాథ్ !

Published on May 13, 2019 4:16 pm IST

గత నెలలో విడుదలైన నాని ‘జెర్సీ’ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయకిగా నటించిన శ్రద్ధ శ్రీనాథ్ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. దీంతో పాటు తమిళంలో ఆమె చేసిన ‘కె 13’ కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ వరుస విజయాలతో ఆమెకు ఆఫర్లు పెరిగాయి. హీరో విశాల్ చేయాలనుకుంటున్న కొత్త చిత్రంలో ఆమెకు అవకాశం వచ్చినట్టు కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఈ చిత్రం గతంలో విశాల్ చేసిన సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇరుంబు తిరై’కు సీక్వెల్ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా పిఎస్. మిత్రన్ డైరెక్ట్ చేస్తాడట. తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమా ఒకేసారి రిలీజ్ కానుంది. ఇది కాకుండా టాలీవుడ్లో సైతం శ్రద్ధకు అవకాశాలు బాగానే ఉన్నాయి. వైవిధ్యమైన కథలు రాసుకునే దర్శకులు ఆమె వైపు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More