“దిగు దిగు దిగు నాగ” సాంగ్ పై శ్రేయా ఘోషల్ ఏమన్నారంటే?

Published on Aug 4, 2021 6:01 pm IST

వరుడు కావలెను చిత్రం నుండి విడుదల అయిన దిగు దిగు దిగు నాగ పాట మాస్ ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది. అయితే ఈ లిరికల్ సాంగ్ విడుదల అయిన కొద్ది గంటల్లోనే ఈ పాట 1 మిలియన్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ పాట కి అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా, శ్రేయా ఘోషల్ స్వర పరిచారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.

అయితే ఈ పాట పై శ్రేయా ఘోషల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. థమన్ గారు ఎప్పుడు డిఫెరెంట్ సాంగ్స్ ఇస్తూ ఉంటారు అని, ఇది చాలా ఫన్ గా ఉంటుంది అంటూ దిగు దిగు దిగు నాగ పాట గురించి చెప్పుకొచ్చారు. అయితే మీ మాటల్లో చెప్పాలంటే మిర్చి బజ్జీ పై క్రీం కేక్ లాంటిది అంటూ చెప్పుకొచ్చారు. అయితే శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :