హాట్ టాపిక్ గా మారిన శ్రియ పెళ్లి ఫోటోలు !

తెలుగు, తమిళ పరిశ్రమల్లో అగ్ర కథానాయకిగా వెలుగొంది, స్టార్ హీరోలందరి సరసనా నటించి ప్రస్తుతం పలు సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తున్న నటి శ్రియ శరన్ పెళ్లి వ్యవహారం పై క్లారిటీ వచ్చింది. ఆమె మార్చి 12న తన బాయ్ ఫ్రెండ్, రష్యాకు చెందిన ఆండ్రెయ్ కొశ్చివ్ ను వివాహం చేసుకుందని వస్తున్న వార్తలు ఈరోజు సోషల్ మీడియాలో బయటకు వచ్చిన పెళ్లి ఫోటోలతో నిజమని తేలిపోయాయి.

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్లో ఈ పెళ్లి చాలా కొద్దిమంది సమక్షంలో, సింపుల్ గా జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబందించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే శ్రియ తెలుగులో ‘వీరభోగ వసంత రాయలు’, తమిళంలో ‘నరగసూరన్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.