ఓటిటి సమీక్ష: ‘స్పేస్ జెన్: చంద్రయాన్’ – తెలుగు డబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో

ఓటిటి సమీక్ష: ‘స్పేస్ జెన్: చంద్రయాన్’ – తెలుగు డబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో

Published on Jan 23, 2026 7:52 PM IST

spacegen

విడుదల తేదీ : జనవరి 23, 2026
స్ట్రీమింగ్ వేదిక : జియో హాట్ స్టార్

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: నకుల్ మెహతా, ప్రకాష్ బెలవాడి, గోపాల్ దత్, శ్రేయా శరన్ తదితరులు
దర్శకుడు: అనంత్ సింగ్
నిర్మాతలు: ప్రేమ్ షీలా కుమార్, ఎన్ కుమార్
సంగీతం: రోహన్ రోహన్
ఛాయాగ్రహణం: శ్రీదత్త నం జోషి
కూర్పు: ఫరూక్ నం జోషి

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లో పెద్దగా సినిమాలు లేవు. అయితే ఓటిటిలో పలు సినిమాలు సిరీస్ లు వచ్చాయి. అలా వచ్చిన లేటెస్ట్ సిరీస్ లలో జియో హాట్ స్టార్ తీసుకొచ్చిన దేశభక్తి సిరీస్ ‘స్పేస్ జెన్: చంద్రయాన్’ కూడా ఒకటి. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ప్రపంచ అంతరిక్ష వ్యవస్థలో చంద్రుని మీదకి వెళ్లేందుకు చాలానే ప్రయోగాలు జరిగాయి. కానీ నీటి జాడ ఉందని మొదట తెలిపిన ప్రయోగం భారత దేశం తరపున జరిపిన చంద్రయాన్ ప్రయోగం ద్వారానే తెలిసింది. ఇలా చందునిపై అత్యంత కష్టతరమైన ప్రదేశం దక్షిణ దృవం మీదకి ల్యాండర్ విక్రమ్ ని పంపే ప్రయత్నంలో భారత్ అప్పటికే రెండు సార్లు విఫలం అయ్యింది. 2019లో జరిగిన చంద్రయాన్ 2 తర్వాత ప్రయోగం మరింత సవాళ్లు, కష్టతరంగా మారుతుంది. మరి ఈ మూడవ ప్రయోగ బాధ్యతని రాకేష్ మొహంతి (గోపాల్ దత్) – ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఇస్రో డైరెక్టర్ సుదర్శన్ రామయ్య (ప్రకాష్ బెలవాడి) సారథ్యంలో తన టీం అర్జున్ వెర్మ (నకుల్ మెహతా) – నేవిగేషన్ సిస్టం మేనేజర్, యామిని (శ్రేయా శరన్) – చంద్రయాన్ 2 డైరెక్టర్ ల చేతిలో పెడతారు. మరి ఈ కష్టమైన మెషిన్ ని వీరు ఎలా ముగించగలిగారు. ఈ క్రమంలో ఇతర దేశాల నుంచీ, మధ్యలో ప్రకృతి పరంగా కూడా ఎదురైనా సవాళ్లు ఏంటి? వాటిని అధిగమించి భారత్ ఎలా నిలదొక్కుకుని గర్వ కారణంగా నిలిచింది అనేది తెలియాలి అంటే ఈ సినిమా ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ వెబ్ సిరీస్ ని ఏమాత్రం అంచనాలు లేకుండా మీకు కొంచెం ఈ చంద్రయాన్ అంటే ఏంటి? దేశ భక్తి లాంటివి ఉంటే డెఫినెట్ గా మిమ్మల్ని కదిలించే సిరీస్ గా నిలుస్తుంది. కేవలం 5 ఎపిసోడ్స్ ప్రతీ ఎపిసోడ్ అరగంట మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఇందులో ఎన్నో ఎమోషన్స్, ఊహించని మలుపులు, కదిలించే అనుభూతులు అందిస్తుంది.

ఇది కేవలం చంద్రయాన్ ప్రయోగం ఒక్క దానికోసమే కాకుండా అంతర్లీనంగా మనకి తెలియాలి చాలా అంశాలని చూపిస్తుంది. ఇందులో కనిపించే అర్జున్, ఇస్రో డైరెక్టర్ సుదర్శన్ రామయ్య పాత్రలు వారి బ్యాక్ స్టోరీలు ఒక పాఠంలా అనిపిస్తాయి. వారి వెనుక ఉన్న గతాలు ఎలా వారిని ప్రభావితం చేసి దేశానికి ఏదైనా చేయాలి అని నిలిచే విధంగా మార్చాయి అనేవి ఎంతో ప్రభావవంతంగా కనిపిస్తుంది.

వారి బ్యాక్ స్టోరీలు వారి పాత్రల మధ్య ఘర్షణ, మాటలు అద్భుతంగా అనిపిస్తాయి. ఒక చోట భయాన్ని వదిలి ధైర్యంగా ఉండు అని చెప్పే చిన్నపాటి సన్నివేశం ఉంటుంది. ‘భయం ఒక రియాక్షన్, ధైర్యం నీ నిర్ణయం’ అనే చిన్న లైన్ ఎంతో ఆలోచించేలా చేస్తుంది. అంతే కాకుండా రామయ్య పాత్ర మన తెలుగు నేటివిటీకి చెందడం, ఆ పాత్రకి ఉన్న ప్రాముఖ్యత చూస్తే మన తెలుగు ఆడియెన్స్ కి కూడా ఇది మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది.

వీటితో పాటుగా ప్రతీ ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగుతూ అందులోని కదిలించే భావోద్వేగాలు, మెప్పించే పోటాపోటీ సీన్స్, సస్పెన్స్ తో కూడిన ఎలిమెంట్స్ తో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్ తో చూసే ఆడియెన్ కి అన్ని రకాలుగా హుక్ చేసి ఉంచుతుంది.

అంతరిక్షంలో జీ సాట్ – 7 రుక్మిణి (ఇండియన్ నేవి శాటిలైట్) ని ఎదురుగా వస్తున్న శకలాలు నుంచి తప్పించే సీక్వెన్స్ గాని ప్రతీక్ గాంధీ, గోపాల్ దత్ మధ్య ఓ మీడియా డిబేట్ సీక్వెన్స్ గాని చంద్రయాన్ కి, ముఖ్యంగా భారతదేశానికి ఎదురయ్యే సవాళ్ళని మన వాళ్ళు ఎలా అధిమించి విజయాన్ని సాధించారు అనే అంశాలు ఇందులో కట్టిపడేసే విధంగా అనిపిస్తాయి. దీనితో పాటుగా రతన్ టాటా, ప్రతీక్ గాంధీ లపై కొన్ని సీన్స్ మంచి హై మూమెంట్స్ లా నిలుస్తాయి.

వీటితో పాటుగా కోవిడ్ సమయంలోనే కాకుండా ఇతర కష్టతర పరిస్థితుల్లో ఇతర దేశాలకి మనం సాయం చేసినప్పటికీ మన దేశాన్ని నిస్సహాయ స్థితిలో వదిలేయడం, రక్షణ పరంగా భారత్ వెనకబాటు, మేకిన్ ఇండియా, ఈ మిషన్ పట్ల శాస్త్రవేత్తలు పడ్డ ఇబ్బందులు, అవమానాలు లాంటి అంశాలు వాటిపై సన్నివేశాలు చాలా బాగున్నాయి.

ప్రతీ ఒక్కరూ ఈ సిరీస్ లో తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయారు. శ్రేయ, అర్జున్ పాత్రలో నకుల్ మెహతా చాలా బాగా చేశారు. కొన్ని పాత్రలుని మనం ముందు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు కానీ నెమ్మదిగా వారి సైడ్ తీసుకుంటాం. ఇలా వారి పాత్రలు తీర్చిదిద్దిన విధానం ఇందులో మెప్పిస్తుంది. అంతే కాకుండా ఇందులో సంగీతం కూడా మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా వరకు బాగా డిజైన్ చేశారు. నిజంగా ఇస్రో, అంతరిక్ష వాతావరణాల్ని సెటప్ చేసి ఆడియెన్స్ ని అందులోకి తీసుకెళ్లారు.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ తక్కువ నిడివి లోనే వచ్చినప్పటికీ ఒకటీ రెండు చోట్ల కథనం కొంచెం నెమ్మదించినట్టు అనిపిస్తుంది. మెయిన్ గా మూడో ఎపిసోడ్ లో కొద్దిగా మూమెంట్స్ స్లో అయ్యాయి. అంతే కాకుండా ఈ చంద్రయాన్ అంటే ఏంటి? ఆ స్పేస్ సెంటర్, ఇస్రో అందులో శాస్త్రవేత్తలు మాట్లాడుకునే పలు సాంకేతిక అంశాలు లాంటివి అన్ని వర్గాల ఆడియెన్స్ కి త్వరగా కనెక్ట్ కాకపోవచ్చు. అలాగే వీటితో కొన్ని సీన్స్ అక్కడక్కడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో కొంచెం అలోచించి ఈ సిరీస్ ని ప్లాన్ చేసుకుంటే మంచిది.

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. బడ్జెట్ ఎంత అయ్యిందో కానీ బహుశా తక్కువే అయ్యి ఉండొచ్చు ఆ అంతలో కూడా మంచి అవుట్ పుట్ ఇందులో కనిపిస్తుంది. కొన్ని చోట్ల వి ఎఫ్ ఎక్స్ తేలికగా ఉన్నాయి కానీ దాదాపు మాత్రం వి ఎఫ్ ఎక్స్ వర్క్ చాలా బాగుంది. అంతరిక్షంలోకి వెళ్లి తీసినట్టే నాచురల్ గా చూపించారు.

అలాగే ఇందులో సంగీతం మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏ సీన్ కి ఎలా ఉండాలో ఎంత హై మూమెంట్ సీన్ కి ఎలా ఉండాలో ఆ రీతిలో రోహన్ రోహన్ అందించారు. అలాగే శుభం శర్మ డైలాగ్స్ చాలా బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. శ్రీదత్త నం జోషి కెమెరా వర్క్ బాగుంది. ఫరూక్ హుందేకర్ ఎడిటింగ్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది.

ఇక ఈ సిరీస్ కి శుభమ్ శర్మ, నితిన్ తివారి స్క్రీన్ ప్లే అందించారు. వారి స్క్రీన్ ప్లే చాలా బాగుందని చెప్పొచ్చు. ఏ సీన్ కి ఆ సీన్ తో చూసే ఆడియెన్ ని ఎక్కడా రెస్ట్ తీసుకోనివ్వకుండా మంచి ఎమోషన్స్, హై ఎలిమెంట్స్ తో తీసుకెళ్లారు. ఈ క్రమంలో దర్శకుడు అనంత్ సింగ్ కూడా సాలిడ్ వర్క్ అందించారు. ప్రతీ నటుని నుంచి ది బెస్ట్ రాబట్టి అన్ని కోణాల్లో కూడా మంచి అవుట్ పుట్ ని వెలికి తీశారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘స్పేస్ జెన్: చంద్రయాన్’ సిరీస్ ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్ అని చెప్పొచ్చు. మనకి చంద్రయాన్ అనే ప్రయోగం కోసం, చూసింది విన్నదే తెలిసి ఉండొచ్చు కానీ అసలు దాని వెనుక ఎంత జరిగింది? ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి? వాటిని ధీటుగా మన శాస్త్రవేత్తలు ఎలా నిలిచి జయకేతనం ఎగరేశారు లాంటివి తెలియవు. కానీ వాటి అన్నిటిని ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగి ఉంటుంది అనే అంశాలు స్పష్టంగా దాదాపు అందరికీ అర్ధమయ్యే రీతిలో మంచి ఎమోషన్స్, కావాల్సినన్ని హై మూమెంట్స్ తో ఈ సిరీస్ సాగుతుంది. మంచి దేశభక్తి సిరీస్ లు, సినిమాలు ఇష్టపడేవారికి ఈ సిరీస్ కూడా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. వీటితో పాటుగా చంద్రయాన్ ప్రయోగం కోసం తెలుసుకోవాలి అనుకుంటున్నాం అంటే ఈ సిరీస్ ని ఖచ్చితంగా చూడండి. డోంట్ మిస్ ఇట్.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు