“సలార్” షూట్ పై అప్డేట్ ఇచ్చిన శృతి.!

Published on Aug 11, 2021 8:00 am IST


పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మొట్టమొదటి సారిగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఇటీవలే ఈ చిత్రం రెండో షెడ్యూల్ ని స్టార్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే..

దానిపైనే శృతి హాసన్ చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రెజెంట్ సలార్ షూట్ శరవేగంగా జరుగుతుంది అని అంతే కాకుండా ఒక బెస్ట్ టీం లో ఇలాంటి వండర్ ఫుల్ ప్రాజెక్ట్ లో తాను చేస్తుండడం నిజంగా ఒక బ్లెస్సింగ్ లా ఫీల్ అవుతున్నానని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ భారీ చిత్రంలో మరింత మంది ప్రముఖులు నటిస్తుండగా రవి బాసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హోంబేలె పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :