తెలుగు తెరనుండి అనూహ్యంగా ఏడాదిపాటూ పాజ్ బటన్ నొక్కవలిసివచ్చిన శృతిహాసన్ కోలీవుడ్ లో బిజీగా మారింది. తాజా సమాచారం ప్రకారం అజిత్, శృతిహాసన్ ల కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.
ఈ సినిమాను ‘శౌర్యం’ చిత్రాన్ని తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో అజిత్ చెల్లెలి పాత్రకోసం అన్వేషణ సాగిస్తున్నారు. బిందు మాధవి ఈ పాత్రను పోషించే అవకాశాలు వున్నాయి. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మే నెల నుండి మొదలుకానుంది.
ఏ.ఎం రత్నం ఈ సినిమాకు నిర్మాత. అనిరుధ్ సంగీత దర్శకుడు.


