స్విట్జర్లాండ్ లో వర్క్ ఫినిష్ చేసిన శృతి హాసన్.

స్విట్జర్లాండ్ లో వర్క్ ఫినిష్ చేసిన శృతి హాసన్.

Published on Sep 29, 2014 4:12 PM IST

Shruti-Hassan

విశాల్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ‘పూజై’. స్విట్జర్లాండ్ లో జరిగిన పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. టాకీ పార్ట్ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలతో తెలుగు, తమిళంలో మంచి పేరు పొందిన హరి ఈ సినిమాకి దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. మరో రెండు రోజుల్లో అక్టోబర్ 1న తమిళ ఆడియో విడుదల చేస్తున్నారు.

తెలుగులో ఈ చిత్రాన్ని ‘పూజ’ పేరుతో అనువదిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ తెలుగు, తమిళ భాషలలో ఒక పాట పాడడంతో పాటు స్వయంగా డబ్బింగ్ చెప్పింది. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 22న విడుదల చేస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు ఆడియో విడుదల తేది ఇంకా ప్రకటించలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు