వివాదాల్లో చిక్కుకున్న శృతిహాసన్

వివాదాల్లో చిక్కుకున్న శృతిహాసన్

Published on Mar 27, 2015 3:10 PM IST

sruthihasan
ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంది. నాగార్జున – కార్తీలు హీరోలుగా రూపొందుతోన్న ఓ భారీ మల్టీ స్టారర్‌లో నటించేందుకు హీరోయిన్‌గా శృతిహాసన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఆ సినిమాకు డేట్స్ ఇచ్చిన శృతిహాసన్, సినిమాలో నటించేందుకు గానూ అడ్వాన్స్ కూడా తీసుకుంది. అయితే తాజాగా మొదటి షెడ్యూల్ సమయంలో ఆమె షూటింగ్‌లో పాల్గొనలేదు. ఇదే విషయమై సినిమాని నిర్మిస్తోన్న పిక్చర్ హౌస్ మీడియా సంస్థ శృతిని సంప్రదించగా డేట్స్ లేవని చెప్పి, సినిమా నుంచి తప్పుకుందట.

ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన నిర్మాణ సంస్థ, శృతిపై కేసు నమోదు చేసింది. ఆమెపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన కోర్టు, విచారణ చేపట్టింది. ఈ విషయమై తర్వాతి ఉత్తర్వులు వచ్చే వరకూ శృతిని వేరే ఇతర సినిమాలకు ఒప్పుకోవద్దని షరతు విధించింది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమౌతోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు