ఎన్టీఆర్‌తో శ్రుతి హాసన్.. కానీ!

ఎన్టీఆర్‌తో శ్రుతి హాసన్.. కానీ!

Published on Apr 24, 2025 11:00 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇక పీరియాడిక్ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ కూడా కనిపిస్తుందట. అయితే, ఆమె కేవలం ఓ ఐటెం సాంగ్‌లో మాత్రమే కనిపించనుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ చిత్రాల్లో పాటలకు ప్రాధాన్యత ఇవ్వడు. కథలో భాగంగా అవి వస్తుంటాయి. అయితే, డ్రాగన్ చిత్రంలో మాత్రం ఎన్టీఆర్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడట. ఇక దీని కోసం శ్రుతి హాసన్‌ను తీసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నాడట.

ఇప్పటికే ‘సలార్’ చిత్రంలో నటించిన శ్రుతి హాసన్ డైరెక్టర్ మాటను కాదని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి నిజంగానే ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ శ్రుతి హాసన్‌ను ఐటెం సాంగ్‌లో తీసుకుంటాడా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు