నెటిజన్ ప్రశ్నకు శృతి హాసన్ తెలివైన సమాధానం !

Published on Jul 10, 2021 5:57 pm IST

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఏ విషయాన్ని దాచిపెట్టదు. ఒకప్పుడు తన తాగుడు అలవాటు గురించి కూడా డైరెక్ట్ గానే బయటపెట్టిన తెగింపు శృతి హాసన్ సొంతం. తాజాగా శృతి మరో సీక్రెట్ చెప్పుకొచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చాట్ సెషన్ నిర్వహిస్తూ తన కొత్త బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా కూడా పక్కనే కూర్చోపెట్టుకుంది. ఈ చాటింగ్ లో ఒక నెటిజన్ మీ బాడీలో మీకు మీ ముక్కు ఇష్టమేనా ? అంటూ కామెంట్ చేశాడు.

అయితే, ఇలాంటి ప్రశ్నకు కూడా శృతి సమాధానం చెబుతూ….’అవును. నా ముక్కు నాకు బాగా ఇష్టం. ఎందుకంటే నా బాడీలో నేను ఎక్కువ ఖర్చు పెట్టింది దానికే కదా’ అంటూ తానూ చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ గురించి శృతి హాసన్ క్లారిటీగా చెప్పుకొచ్చింది. శృతి హాసన్ కి చిన్నప్పుడు జరిగిన ఓ ప్రమాదంలో ఆమె ముక్కుకు చిన్న గాయం అయింది. దాంతో లండన్ వెళ్లి మరీ ఆమె తన ముక్కుకు సర్జరీ చేయించుకొంది.

సంబంధిత సమాచారం :