క్రేజీ మల్టీ స్టారర్ నుంచి శృతి హాసన్ తప్పుకుందా.?

క్రేజీ మల్టీ స్టారర్ నుంచి శృతి హాసన్ తప్పుకుందా.?

Published on Mar 26, 2015 4:17 PM IST

Shruti-Hassan
ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాల హవా మొదలైంది.. ఇప్పటికే పలు సినిమాలు వచ్చి వెళ్ళగా, పలు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. సెట్స్ పై ఉన్నవి కాకుండా కింగ్ నాగార్జున – తమిళ హీరో కార్తీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా కూడా ఇటీవలే ప్రారంభమైంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో శృతి హాసన్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారు. కానీ కోలీవుడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం శృతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకోనుందని అంటున్నారు.

శృతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి మెయిన్ రీజన్ శ్రుతి హాసన్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే అని అంటున్నారు. మహేష్ బాబు శ్రీ మంతుడు మరియు విజయ్ పులి సినిమాకి ఎక్కువ బల్క్ డేట్స్ ఇవ్వడం వలన, అలాగే మధ్యలో గబ్బర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉండడం వలన నాగ్ – కార్తీ సినిమాకి డేట్స్ సర్దలేకపోవడం వలన ఈ సినిమా నుంచి తప్పుకొనే ఆలోచనలో శృతి ఉందని సమాచారం. మరి శృతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకుంటే ఎవరికి ఈ మల్టీ స్టారర్ లో ఛాన్స్ దొరుకుతుందా అనేది చూడాలి.

ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. పివిపి నిర్మించనున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తాడు. ప్రస్తుతం నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన తో బిజీగా ఉంటే, కార్తీ ‘కాష్మోరా’ అనే మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు