మానస వారణాసి, శ్రీదేవి జాబిలి చేతుల మీదుగా అనకాపల్లిలో ‘శుభప్రదం షాపింగ్ మాల్’ ప్రారంభం

మానస వారణాసి, శ్రీదేవి జాబిలి చేతుల మీదుగా అనకాపల్లిలో ‘శుభప్రదం షాపింగ్ మాల్’ ప్రారంభం

Published on Apr 6, 2026 8:00 AM IST

maa

అనకాపల్లి పట్టణంలో ‘శుభప్రదం షాపింగ్ మాల్’ నూతన బ్రాంచ్‌ను శుక్రవారం (ఏప్రిల్ 3న) ఘనంగా ప్రారంభించారు. సినీ తారలు మానస వారణాసి, శ్రీదేవి జాబిలి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఏపీ అర్బన్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, జనసేన ఇంచార్జ్ భీమరశెట్టి రాంకీ హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సంస్థ అధినేత అల్లాక సత్యనారాయణ మాట్లాడుతూ.. నాణ్యమైన వస్త్రాలను, సరికొత్త డిజైన్లను అందరికీ అందుబాటు ధరల్లో అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ స్థాయి షాపింగ్ అనుభూతిని స్థానికులకు అందించడంతో పాటు, ఈ మాల్ ద్వారా సుమారు 100 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

కుటుంబమంతటికీ అవసరమైన ఫ్యాషన్ ఉత్పత్తులు, బ్రాండెడ్ వస్త్రాలు ఇక్కడ ఒకే చోట లభిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లను సైతం ప్రకటించారు. ఈ షాపింగ్ మాల్ అనకాపల్లి మెయిన్ రోడ్డులోని శ్రీ సత్య థియేటర్ వద్ద కొలువుదీరింది.

తాజా వార్తలు