యూఎస్ లో స్ట్రాంగ్ గా దూసుకెళ్తున్న “శ్యామ్ సింగ రాయ్”.!

Published on Jan 5, 2022 10:00 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి మరియు కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. యంగ్ అండ్ టాలెంటడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది మంచి హిట్ సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.

అయితే నాని కెరీర్ లోనే మరో బెస్ట్ సినిమాగా నిలిచిన ఈ చిత్రం బెస్ట్ వసూళ్లను కూడా పలు ఇబ్బందులని అధిగమించి అందుకొని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను ప్రీమియర్స్ నుంచే అందుకొని తర్వాత మంచి హోల్డ్ ని కనబరిచింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 8 లక్షల డాలర్స్ ని క్రాస్ చేసి అదరగొట్టింది. మరి దీనితో ఫైనల్ రన్ లో 1 మిలియన్ మార్క్ కి దగ్గరగా చేరుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందివ్వగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :