“శ్యామ్ సింగరాయ్” ట్రైలర్ కి టైమ్ ఫిక్స్!

“శ్యామ్ సింగరాయ్” ట్రైలర్ కి టైమ్ ఫిక్స్!

Published on Dec 14, 2021 4:18 PM IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా శ్యామ్ సింగరాయ్. నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు. ఈ చిత్రం ను డిసెంబర్ 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నేడు శ్యామ్ సింగరాయ్ రాయల్ ఈవెంట్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్, కాకతీయ యూనివర్సిటి, హన్మకొండ, వరంగల్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక లో 7 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ తెలిపింది. నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు