ప్రభాస్ పెళ్లిపై శ్యామలా దేవి గుడ్ న్యూస్.. త్వరలోనే..!

ప్రభాస్ పెళ్లిపై శ్యామలా దేవి గుడ్ న్యూస్.. త్వరలోనే..!

Published on Aug 12, 2025 2:00 AM IST

Prabhas 0

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన ప్రభాస్ పెళ్లిపై గతకొంత కాలంగా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి ఎవరితో.. ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తికరంగా చూస్తున్నారు.

అయితే తాజాగా ప్రభాస్ పెళ్లిపై మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి తాజాగా ఆయన పెళ్లిపై కొన్ని కామెంట్స్ చేశారు. ఆమె తాజాగా ఓ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ఇస్తామని ఆమె తెలిపారు.

దీంతో మరోసారి ప్రభాస్ పెళ్లిపై అభిమానుల్లో టాక్ మొదలైంది. మరి ప్రభాస్ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు