ఇష్క్: సిద్ శ్రీరామ్‌ ఆలపించిన పాట అదిరిందిగా..!

Published on Jul 25, 2021 1:13 am IST


జాంబీరెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా ప్రియా ప్రకాష్‌ వారియర్‌ జంటగా ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఇష్క్’- నాట్‌ ఎ లవ్‌స్టోరీ. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌లు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30వ తేదిన థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

ఈ నేపధ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. “ఆనందమా మదికే” అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్‌ ఆలపించగా, శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు. ప్రస్తుతం ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. మరీ ఈ పాటను మీరు కూడా ఓసారి వినేసేయండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :