రజనీకాంత్ కొత్త సినిమాలో సిద్దార్థ్

Published on Jan 23, 2020 11:00 pm IST

తమిళ హీరో సిద్దార్థ్ సోలో హీరోగా సినిమాలు చేస్తూనే క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్, శంకర్ చేస్తున్న ‘ఇండియన్ 2’ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్న ఈ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రంలో కూడా అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని శివ డైరెక్షన్లో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ముగిసింది. ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సిద్దార్థ్ ఎంపికయ్యారని, త్వరలో మొదలుకానున్న రెండో షెడ్యూల్లో ఆయన జాయిన్ అవుతారని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇన్నేళ్ల కెరీర్లో సిద్దార్థ్ రజనీతో కలిసి వర్క్ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. ఇకపోతే సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More