కమల్ హాసన్ సినిమాలో సిద్దార్థ్

Published on Jul 17, 2019 1:25 am IST

విశ్వనటుడు కమల్ హాసన్ యొక్క ‘ఇండియన్ 2’ చిత్రం ఈ ఏడాది ఆగష్టు నెలలో మొదలుకానుంది. ఇది వరకే మొదలైన ఈ సినిమా బడ్జెట్ కారణాల రీత్యా అలస్యమై ఆగష్టు నెలకు వాయిదాపడింది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో హీరో సిద్దార్థ్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా భారీ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న సిద్దార్థ్ కు కమల్ హాసన్ సినిమాలో ఛాన్స్ దక్కడం మంచి అవకాశమని చెప్పొచ్చు.

గతంలో సిద్దార్థ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘బాయ్స్’ చిత్రంలో నటించాడు. ఆ చిత్రం అతనికి మంచి పేరును అందించింది. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నాడట సిద్దార్థ్. ప్రస్తుతం ఈయన తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సైతం ఒక ముఖ్య పాత్రలో నటించనుంది.

సంబంధిత సమాచారం :