బరువు తగ్గి ఖరీదైన కారును గిఫ్టుగా పట్టేసిన స్టార్ హీరో

Published on Dec 2, 2020 2:00 am IST

ఈమధ్య హీరోలకు ఫిట్నెస్ మీద శ్రద్ద బాగా పెరిగింది. లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ లేక ఖాళీ సమయం దొరకడంతో శరీరాకృతి మీద దృష్టి పెట్టి ఆకర్షణీయమైన బాడీని సిద్దం చేసుకున్నారు. అలాంటి హీరోల్లో శింబు కూడ ఒకరు. ఇంతకు ముందు బాగా బొద్దుగా కనిపించిన శింబు లాక్ డౌన్లో డైట్, యోగా, జిమ్, డ్యాన్సులు చేసి బాగా బరువు తగ్గారు. ఆయన డెడికేషన్ చూసి అభిమానులు, ప్రేక్షకులు ప్రసంశలు కురిపించారు.

స్లిమ్ లుక్ బాగుందని చాలా మంచి ఫీడ్ బ్యాక్ లభించింది. దీంతో శింబు తల్లి సైతం ఇంప్రెస్ అయి శింబుకు ఖరీదైన మినీ కూపర్ కారును బహుమతిగా అందించారు. ఈ కారు విలువ 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. బరువు తగ్గడంతో శింబుకు ప్రసంశలే కాకుండా మంచి కారు కూడ బహుమతిగా వచ్చింది. ఇకపోతే ఆయన నటించిన కొత్త చిత్రం ‘ఈశ్వరన్’ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇది కాకుండా శింబు ‘మానాడు’ అనే కొత్త చిత్రం కూడ చేస్తున్నారు. అది కూడ 2021లోనే రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :

More