మొదటి రోజు బాగానే రాబట్టిన టెంపర్ హిందీ రీమేక్ !

Published on Dec 29, 2018 4:14 pm IST


ఎన్టీఆర్ – పూరి కాంభినేషన్ లో తెరకెక్కిన ‘టెంపర్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఎన్టీఆర్ నటన , పూరి టేకింగ్ ఈ చిత్ర విజయం లో కీలక పాత్ర పోషించాయి. ఇక ఈ చిత్రం హిందీలో ‘సింబా’ గా రీమేక్ అయ్యింది. యువ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం నిన్న భారీ స్థాయిలో విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. దాంతో మొదటి రోజు ఈ చిత్రం 20కోట్ల వసూళ్లను రాబట్టింది.

అయితే ఒరిజినల్ వర్షన్ నుండి సీన్ టు సీన్ కాపీ చేయకుండా ఈ రీమేక్ లో చాలా మార్పులు చేశాడు దర్శకుడు రోహిత్ శెట్టి. ఇక ఈ చిత్రం రణ్వీర్ కెరీర్ లోనే అత్యదిక ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

సారా అలీ ఖాన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. కరణ్ జోహార్ తో కలిసి రోహిత్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించాడు.

సంబంధిత సమాచారం :