ఆ పాత్రల కంటే ఆంటీ పాత్రలే బెస్ట్ – సిమ్రాన్

ఆ పాత్రల కంటే ఆంటీ పాత్రలే బెస్ట్ – సిమ్రాన్

Published on Apr 20, 2025 3:16 PM IST

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ప్రస్తుతం తాను చేయబోయే సినిమాల పై, తానూ కనిపించే పాత్రల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సిమ్రాన్ స్టేజ్‌పై మాట్లాడుతూ.. ‘కొన్నిరోజుల క్రితం నాకు బాగా తెలిసిన తోటి నటికి ఓ మెసేజ్ పంపించాను. ఆమె నటించిన ఓ సినిమాని ఉద్దేశించి అందులో రాసుకొచ్చాను. ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుందని.. ఆ రోల్‌ చూసి ఆశ్చర్యపోయానని మెసేజ్‌ పంపాను. దానికి ఆమె వెంటనే స్పందించింది. ఆంటీ రోల్స్‌లో నటించడం కంటే ఇది ఎంతో ఉత్తమం అంటూ నాకు సమాధానంగా ఆమె మెసేజ్ పంపింది’ అని సిమ్రాన్ తెలిపింది.

సిమ్రాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే ఆమె పంపిన మెసేజ్‌ నన్ను ఒకింత షాక్‌కు గురి చేసింది. ఆమె ఎంతో చులకనగా మాట్లాడినట్లు అనిపించింది. ఈ వేదికగా ఆమెకు నేను చెప్పేది ఒక్కటే. పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే, ఆంటీ లేదా అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమం. ఏ వర్క్‌ చేసినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి’ అంటూ సిమ్రాన్ తెలిపింది. ఇటీవల విడుదలైన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’లో సిమ్రన్‌ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు