నాగ్ అశ్విన్ నిర్మాణంలో లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో అహల్య, అయాన్, శాలిని ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో నాగ్ అశ్విన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇటీవల మీడియా సమావేశంలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఓటీటీ వెర్షన్ థియేట్రికల్ వర్షన్ కంటే భిన్నంగా ఉంటుందని తెలిపారు. సమయం లేకపోవడం వల్ల క్లైమాక్స్‌లో కొన్ని సీజీ పనులు అనుకున్నంత బాగా రాలేదని.. భవిష్యత్తులో కూడా ఈ సినిమా నిలిచిపోయేలా డిజిటల్ రిలీజ్ లోపు ఆ విజువల్ ఎఫెక్ట్స్‌ను మరింత మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్లలో సినిమా విజయవంతంగా రన్ అవుతుండటంతో, ఓటీటీ స్ట్రీమింగ్‌కు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.


