ఎట్టకేలకు నేడు విడుదలవుతోన్న ‘సింగం 3’!

singam3
తమిళ స్టార్ హీరో సూర్యకి తమిళనాట ఎంత క్రేజ్ ఉందో, తెలుగులోనూ ఇంచుమించు అదే స్థాయి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలన్నీ ఇక్కడి పెద్ద హీరోల సినిమాల రేంజ్‌లో విడుదలవుతుంటాయి. మరి అలాంటి స్టార్ హీరో సినిమా ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు సార్లకు పైనే వాయిదా పడుతూ వస్తే ఎలా ఉంటుంది? ఆయన హీరోగా నటించిన ‘సింగం 3’ విషయంలో ఇదే జరిగింది. అన్ని కార్యక్రమాలూ పక్కాగా పూర్తి చేసుకొని డిసెంబర్ నెలలోనే విడుదల కావాల్సిన సినిమా, ఏవేవో కారణాలతో వాయిదా పడుతూ వచ్చి ఫిబ్రవరి 9కి పక్కాగా ఫిక్స్ అయింది.

ఇక తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం కీలక మార్పులు చోటు చేసుకుంటూ ఉండడంతో, ఈసారి కూడా ‘సింగం 3’ వాయిదా పడుతుందన్న ప్రచారం వినిపించగా, ఆ ప్రచారాలన్నింటికీ తెరదించుతూ ‘సింగం 3’ నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోస్‌ కూడా మొదలయ్యాయి. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించింది.

Exit mobile version