తన ప్రెగ్నెన్సీ పై క్లారిటీ ఇచ్చిన సింగర్ !

Published on Jul 3, 2021 7:52 pm IST

గాయనీగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ‘చిన్మయి శ్రీపాద’ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు, ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగానే ఆమె పై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా ఈ గాయని తల్లి కాబోతుంది అంటూ ఒక రూమర్ బాగా వినిపిస్తోంది. చిన్మయి రీసెంట్ గా తన భర్త రాహుల్‌ రవిచంద్రన్‌ సోదరుడు వివాహానికి హాజరైన సందర్భంగా పలు ఫోటోలు దిగారు.

రాహుల్‌ ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అయితే ఆ ఫోటోలో చిన్మయి చీర కట్టుకున్న విధానం కారణంగా ఆమె బేబి బంప్‌ తో ఉన్నట్లు అనిపించింది. దాంతో చిన్మయి గర్భవతి అయిందని పుకార్లు పుట్టించారు. ఈ రూమర్స్‌ పై చిన్మయి స్పందిస్తూ తన ఇన్‌ స్టాగ్రామ్‌ స్టోరీస్‌ లో ఒక సుధీర్ఘ మెసేజ్ ను పోస్ట్ చేసింది.

మెసేజ్ విషయానికి వస్తే.. ‘ఈ ఫోటోలో నేను అల కనిపించడానికి కారణం మడిసార్‌ ధరించడమే. కేవలం మడిసార్‌ కారణంగా నా పొట్ట పెద్దదిగా కనిపించింది. అందుకే నేను గర్భవతిని అనుకున్నారు. మడిసార్‌ తో ఎక్కువగా నడవడం కారణంగా నా చీర బాగా వదులు అయ్యింది. ఇప్పటికైనా ప్రెగ్నెన్సీ రూమర్స్‌ ను ఆపండి’ అని ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది ఈ సింగర్.

సంబంధిత సమాచారం :