నెటిజన్ కోరికను సున్నితంగా తిరస్కరించిన సునీత !

Published on May 10, 2021 12:00 pm IST

కరోనా సెకండ్ వేవ్ జనం జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. లోకం అంతటా కమ్ముకున్న విషాద వార్తలతో ప్రజలు కలత చెందకుండా వారిలో నవ్వులను ఆశలను రంగరించడానికి సింగర్ సునీత తనవంతు ప్రయత్నం చేస్తోంది. కరోనా విపత్తులో భయాలతో బాధలతో విసిగిపోయిన జనానికి ఊరట కలిగించడానికి సునీత తన మధురమైన గాత్రంతో అద్భుతమైన పాటలను పాడటానికి తన ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి నెటిజన్లకు కోరిన పాటలను పాడుతూ,ప్రేక్షకులకు గొప్ప రిలీఫ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రతిరోజూ లైవ్‌కి వస్తానని తెలిపిన సునీత, ఈ సందర్భంగా పాటలు పాడుతూ ఫ్యాన్స్‌ అడిగే ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పారు. అయితే ఒక నెటిజన్‌..వాట్సాప్‌ నెంబర్‌ చెప్పమని ఆమెను కోరాడు. దీనికి సో సారీ అండీ అంటూ నవ్వుతూనే సునీత సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని, హాస్పిటల్స్‌లో బెడ్స్‌ దొరక్క ఎంతోమంది అవస్థలు పడుతున్నారని, కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు.

సంబంధిత సమాచారం :