నెటిజన్ కామెంట్‌కి సింగర్ సునీత స్ట్రాంగ్ కౌంటర్..!

Published on Jul 3, 2021 1:03 am IST


సోషల్ మీడియాలో సెలబ్రెటీలను ఫాలోవర్స్ ఎంతలా పైకి లేపుతారో, ఒకానొక సమయంలో అంతేలా విమర్శలు చేస్తుంటారు. అయితే విమర్శలు చేస్తే పర్లేదు కానీ మరీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదు. అయితే ఈ మధ్య కొందరు ఆకతాయిలు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇలాంటి వాటిని కొందరు సెలబ్రెటీలు లైట్ తీసుకున్నా, కొందరు మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంటారు.

అయితే ఇలానే తనపై ఓ ఆకతాయి చేసిన కామెంట్‌కు సింగర్ సునీత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇటీవ‌ల త‌న భ‌ర్త రామ్ వీర‌ప‌నేనితో దిగిన ఒక ఫోటోను సింగర్ సునీత సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫోటోను చూసిన ఓ నెటిజన్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఆంటీ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో ఆ నెటిజన్‌కు సునీత తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. గాడ్ బ్లెస్ యు నాన్న.. బుర్ర మాత్రమే కాదు నువ్వు మనిషిగా కూడా చాలా ఎదగాలి.. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను చూస్తుంటే జాలిగా ఉంది.. నీ సంస్కారానికి నమస్కారాలు అంటూ ఘాటుగా బదులిచ్చింది.

సంబంధిత సమాచారం :