నా లైఫ్‌లో ఎన్నో నిందలు ఎదురుకున్నా – సింగర్ సునీత

Published on Aug 11, 2021 1:30 am IST

ఇటీవ‌ల దాంప‌త్య జీవితంలోకి అడుగుపెట్టిన పాపుల‌ర్ ప్లే బ్యాక్ సింగ‌ర్ సునీత ప్రస్తుతం సెకండ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రెండో పెళ్లి చేసుకోవడం చాలా మందికి ఇష్టం లేదని, తాను పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలా మంది సంతోషించే వారని అన్నారు.

అయితే తన పెళ్లి విషయం కుటుంబసభ్యులకు అందరికి తెలుసని, బయట వారికి చెపాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. నా లైఫ్‌లో తడిగుడ్డతో గొంతు కోసే రిలేషన్ షిప్స్‌ని చూశానని చెప్పుకొచ్చారు. ఇదేకాకుండా తన కెరిర్‌లో తప్పు చేయకుండానే ఎన్నో నిందలు పడ్డానని అన్నారు. ఓ సారి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియోలో పాట పాడడానికి వెళ్లానని అతడు తన చేతిలోని మైక్ ఇచ్చి పాడమన్నారని, అయితే పాట పాడడం పూర్తై బయటకొచ్చాక ఆ మ్యూజిక్ డైరెక్టర్ భార్య మైక్ తీసుకునేటప్పుడు తన భర్త వేళ్లు ఎందుకు తాకావని అసహ్యంగా మాట్లాడిందని, ఆమెకు తనదైన శైలిలో గట్టిగానే సమాధానమిచ్చానని, కానీ ఆమె అన్న మాటలకు ఇంటికెళ్ళి ఆ రోజు రాత్రంతా ఏడ్చానని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :