సింగిల్ మూవీ నుంచి ‘సిర్రాకయింది సింగిల్’ సాంగ్ రిలీజ్

సింగిల్ మూవీ నుంచి ‘సిర్రాకయింది సింగిల్’ సాంగ్ రిలీజ్

Published on Apr 17, 2025 7:11 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘సిర్రాకయింది సింగిల్’ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందంచాడు. సింగిల్ అబ్బాయిల కష్టాలను ఈ పాటలో మనకు తెలియజేశారు. ఇక ఈ పాటలో శ్రీవిష్ణు డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాడు. అటు వెన్నెల కిషోర్ కూడా ఈ పాటలో కనిపించి ఆకట్టుకున్నాడు.

పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని కార్తిక్ రాజు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామలు కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, కళ్యా ఫిలింస్ బ్యానర్లపై ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు