‘సింగిల్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్ చేసిన శ్రీవిష్ణు

‘సింగిల్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్ చేసిన శ్రీవిష్ణు

Published on Apr 26, 2025 8:00 PM IST

యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తిక్ రాజు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఏప్రిల్ 28న మధ్యాహ్నం 3.30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు పాత్ర ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాలో అందాల భామలు కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. మరి ఈ చిత్ర ట్రైలర్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు