వైభవ్ కౌండిన్య దర్శకత్వంలో రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాసిప్’. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి రేమెళ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తొలి పాట ‘సిప్పు సిప్పు’ ఫుల్ లిరికల్ వీడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా చిత్రబృందం విడుదల చేసింది.
మధ్యతరగతి అమ్మాయి జీవితం నేపథ్యంలో సాగే ఈ సినిమా.. నేటి తరానికి కనెక్ట్ అయ్యే భావోద్వేగాలు, ప్రేమకథతో కూడిన సోషల్ సెటైర్‌గా తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపారు. పబ్ డ్యాన్స్ ట్రాక్‌గా రూపొందిన ఈ ‘సిప్పు సిప్పు’ పాటకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చారు. సింగర్ మాళవిక ఈ పాటను ఆలపించారు. సునీల్ సున్నపు, ఫల్గుణి బంగెర కొరియోగ్రఫీ అందించారు.
ఈ సినిమాలో రవివర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సతీష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జై కుమార్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. నరసింహం తెలనాకుల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


