లేటెస్ట్ గా టాలీవుడ్ సహా కోలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో తమిళ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం “సార్” కూడా ఒకటి. మరి తెలుగు సహా తమిళ్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్న ఈ చిత్రం ఈ సక్సెస్ తో అయితే మేకర్స్ సూపర్ హ్యాపీ గా ఉన్నారు.
ఇక దీనితో అయితే సినిమాలో సూపర్ హిట్ అయ్యినటువంటి సాంగ్ మాస్టారు మాస్టారు కి మేల్ వెర్షన్ సాంగ్ ని అందులోని ధనుష్ పాడిన సాంగ్ ని రెండు వెర్షన్స్ లో రిలీజ్ చేయడానికి టైం ఫిక్స్ చేశారు. మరి ఈ అవైటెడ్ సాంగ్ ఈరోజే సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా సర్ప్రైజింగ్ అప్డేట్ ని ఇప్పుడు అందించారు.
దీనితో మ్యూజిక్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ తరుణం ఇప్పుడు రానే వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
The SURPRISE ???? is here ❤️????
The Sensational Hit #VaaVaathi #MastaaruMastaaru Reprise version sung by the man himself @dhanushkraja ????
Out today at 4️⃣:0️⃣5️⃣PM! ????????#VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @ramjowrites @dopyuvraj @vamsi84 @SitharaEnts @7screenstudio @adityamusic pic.twitter.com/37TBdmkZEW
— Sithara Entertainments (@SitharaEnts) February 23, 2023
