కుటుంబ కథా చిత్రం అయినా, కమర్షియల్ సినిమా అయినా, పౌరాణికం అయినా మరియు జానపదం అయినా ఆయన సాహిత్యంలో మాత్రం తెలుగుదనం కొట్టిచ్చినట్టు కనపడుతుంది. ఆయన పాటల్లో వినడానికి కష్టంగా అనిపించే పదజాలం ఉండవు ఆయనే లేజండ్రీ లిరిసిస్ట్ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. తలుగు సినిమా మరియు తెలు లిటరేచర్ ని గర్వించేలా చేసిన ఈయనకి ది సేఫ్ హెల్త్ ఫౌండేషన్ అనే సంస్థ సిరివెన్నెలకి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ఇచ్చి సత్కరించనుంది.
ఈ సత్కార సభ జనవరి 2న హైదరబాద్ లో జరగనుంది. ఈ వేడుకకి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో పాటు సెంట్రల్ మినిస్టర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ స్టేట్ అడ్వైసర్ కెవి రమణాచారి, డైరెక్టర్ కె. విశ్వనాథ్ హాజరు కానున్నారు. కె. విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన ‘సిరివెన్నెల’ సినిమాతో 1986లో సీతారామశాస్త్రి ప్రయాణం మొదలైంది. ఇప్పటి వరకూ సౌత్ లో ఉన్న అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేసారు. తాజాగా సిరివెన్నెల మ్యూజిక్ అందించిన ‘ముకుంద’ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చింది.
